భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టి అయిదేళ్లయిన సందర్భంగా చైనా మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ భారీ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై అమెజాన్ ఇండియాలో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్లపై 10 వేల రూపాయల దారా భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్ ఆప్షన్ లాంచ్ ధర రూ.52,999 ఉండగా.. ఆఫర్ కింద ధర రూ.42,999లకే అందిస్తోంది. అలాగే వన్‌ప్లస్ 7 ప్రో రూ.5వేల తగ్గింపుతో రూ.39,999 లభిస్తోంది. దీపి అసలు ధర వన్‌ప్లస్ 7 ప్రో 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999 దిగి వచ్చింది.
లాంచింగ్ ప్రైస్ కూ.48,999. వన్‌ప్లస్ 7టీ ప్రారంభ ధర రూ.37,000 ఉండగా ఆఫర్‌లో ఇప్పుడు రూ.34,000లకు లభ్యం అవుతోంది. మరోవైపు హెచ్‌బీఎఫ్‌సీ కస్టమర్లకు వన్‌ప్లస్ 7టి, వన్‌ప్లస్ 7 ప్రో కొనుగోలుపై వరుసగా రూ.1500. రూ. 2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐని కూడా అందిస్తోంది. దీంతో పాటు వన్‌ప్లస్ టీవీలపై కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ / డెబిట్ కార్డు ఉపయోగించి వన్‌ప్లస్ క్యూ 1 టీవీ కొనుగోలు చేసిన రూ.4 వేల తక్షణ తగ్గింపుతో రూ.69,899గా లభిస్తుంది. క్యూ 1 ప్రో టీవీ కొనుగోలుదారులకు తక్షణమే రూ.5 వేల తగ్గింపుతో ధర రూ.99,899గా లభిస్తుంది.