తాను ముందు నుంచి ఎన్సీపీలోనే ఉన్నానని.. ఎక్కడికీ పోలేదన్నారు అజిత్ పవార్. రాజకీయంగా పార్టీలో భిన్నాబిప్రాయాలే తప్ప.. వర్గపోరు లేదన్నారు. మీడియా కారణంగానే అపోహలు వచ్చాయన్నారు. ఉద్దావ్ మంత్రివర్గంలో చేరే అంశంపైనా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కార్యకర్తలా బాధ్యతలు నిర్వహిస్తానని అజిత్ అన్నారు.