పది, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ AIATSL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కస్టమర్ ఏజెంట్, హ్యాండీమ్యాన్/హ్యాండీవుమెన్, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్, యుటిలిటీ కమ్ ర్యాంప్ డైపర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దక్షిణాది ప్రాంతంలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 46 ఖాళీలున్నాయి. ఇవి మూడేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్, సర్టిపికెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.500 డీడీ తీయాల్సి ఉంటుంది. తమిళనాడులోని తిరుచ్చిలో 2019 డిసెంబర్ 15న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
మొత్తం ఖాళీలు: 46.. కస్టమర్ ఏజెంట్: 17.. హ్యాంటీమ్యాన్/హ్యాంటీవుమెన్: 23.. ర్యాంప్ సర్వీస్ ఏజెంట్: 02.. యుటిలిటీ కమ్ ర్యాంప్ డ్రైవర్: 04.
విద్యార్హత: కస్టమర్ ఏజెంట్ పోస్టులకు 10+2+3 ప్యాటర్స్‌లో డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్స్ ఆపరేషన్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
హ్యాండీమ్యాన్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. ఇంగ్లీష్ భాష అర్ధం చేసుకోగలగాలి.
ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ పోస్టుకు మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఆటో ఎలక్ట్రికల్/ఎయిర్ కండీషనింగ్/డీజిల్ మెకానిక్/ బెంచ్ ఫిట్టర్/వెల్డర్ విభాగాల్లో NCTVT తో ఐటీఐ (మొత్తం మూడేళ్లు) ఉండాలి. యుటిలిటీ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుకు 10వ తరగతి. HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్లు. ఫీజు: రూ.500. ఎక్స్ సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ జరిగే స్థలం:
BBOT MARCEL RC Higher Secondary School, SEMBATTU, Airport (Post) Tiruchirapalli, Tamil Nadu-620007.