ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు బంపర్ ఆపర్ ప్రకటించింది. 5 రోజుల పాటు బిగ్ షాపింగ్ డే సేల్స్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ సెల్‌లో పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు తక్కువ ధరలకే అందించనుంది. రియల్‌మి 5, రియల్‌మి ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఆపిల్ ఐఫోన్ 7 ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకే అందించనున్నారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులపై ఆఫర్లు, రాయితీలు ఇస్తున్నారు. వీటితో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో వస్తువులు కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.