మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు స్థానిక కోర్టు సమన్లు

Update: 2019-11-29 15:34 GMT

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. ఫడ్నవిస్ తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదన్న ఆరోపణలపై ఈ సమన్లు జారీ అయ్యాయి. శివసేన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన రోజే ఫడ్నవిస్‌కు సమన్లు జారీ కావడం విశేషం.

ఫడ్నవిస్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగపూర్‌కు చెందిన న్యాయవాది సతీష్ యుకె స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు..1996,1998లో ఫడ్నవిస్‌పై మోసం, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఈ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో దాచిపెట్టారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు.

Similar News