హైదరాబాద్ దిశా హత్య అంశంపై.. పార్లమెంట్‌లోనూ వాడీ వేడిగా చర్చ జరగనుంది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తనుంది బీజేపీ. ఆ పార్టీ ఎంపీ ప్రభాత్ షా.. రాజ్యసభలో జీరో అవర్ నోటీసు ఇచ్చారు. హైదరాబాద్ దిశా హత్యతో పాటు దేశంలో మహిళల పట్ల పెరిగిపోతున్న హింసపై సభలో ప్రశ్నించనున్నారు. అటు..ఈ హత్యోదంతాన్ని కాంగ్రెస్ ఎంపీలు సైతం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానం పెట్టారు.
దిశా హత్యపై దేశవ్యాప్తంగా నిరనసలు కొనసాగుతున్నాయి. తెలుగురాష్ట్రాలతో పాటు ఉత్తరాధిలోనూ.. దిశా హత్యను నిరసిస్తూ.. ధర్నాలు, క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశం ఇప్పుడు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనిపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.