హైదరాబాద్‌లో దిశ ఘటన తీవ్రంగా ఖండించారు నిర్భయ తల్లి ఆశా దేవి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే హంతకులకు కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. పోలీసు వ్యవస్థలోనూ, చట్టంలో మార్పులు రావాలని పేర్కొన్నారు. ఘోరమైన నేరాలకు మరెవరూ పాల్పడకుండా చూడాలంటే ఉరిశిక్ష విధించాల్సిందే అని డిమాండ్ చేశారు.
అటు నిర్భయ కేసులో తమకు క్షమాబిక్ష ప్రసాదించాల్సిందిగా దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కోరడాన్ని ఆశా దేవి స్వాగతించారు. హంతకులకు మరణ శిక్ష పడినప్పుడే .. నిర్భయకు న్యాయం జరిగినట్లు అని పేర్కొన్నారు.