కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. మహిళలపై దాడులుకు స్వస్థి పలకాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. కేవలం చట్టాలు చేయడం వల్ల సమస్యను పరిష్కరించలేమన్న ఆయన... కొన్నిసార్లు చట్టంలో ఉన్న లొసుగుల వల్ల న్యాయం ఆలస్యమవుతోందన్నారు. చట్టాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.