అస్తమాను ఫోనేనా అని తాత అరిచేసరికి.. ఆవేశంతో మనవడు..

Update: 2019-12-03 10:17 GMT

పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.. పొద్దస్తమాను ఫోన్ మాట్లాడుడేంది.. బుక్కులు ముట్టేది లేదా అని అమ్మ అరిచింది. నాన్న కూడా ఇదే విషయంపై కొడుకుని మందలించాడు.. బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధి, అల్మాస్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే తంబాజీ మనుమడు లక్ష్మీకాంత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువు సంధ్యా లేకుండా పొద్దాక ఫోన్ మాట్లాడుతుంటే.. దానికంటే చదువు మానెయ్యరాదు అని మందలించాడు మనవడిని. అంతే ఆవేశంతో మనవడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్జీవంగా పడి ఉన్న మనవడి మృతదేహాన్ని చూసి తాత, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నీ కోసమే కదరా నాయనా చెప్పింది. చదువుకుంటే భవిష్యత్ బాగుటుందనుకున్నాం కానీ.. ఇలా బతుకే లేకుండా చేసుకుంటావనుకోలేదని ఆవేదన చెందుతున్నారు.

Similar News