పాము పగ.. తోక తొక్కాడని బైక్‌ని వెంబడించి..

Update: 2019-12-04 10:47 GMT

అయ్యో దేవుడా.. చూసుకోకుండా బైక్‌ని పాము తోక మీదకి పోనిచ్చాను. అదేమో అసలే త్రాచు. నన్ను ఒదిలి పెడితే ఒట్టు. బైక్ స్పీడు పెంచి పారి పోతున్నా.. జర జరా పాకుతూ వెంబడించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చెమటలు పడుతున్నా స్పీడ్ పెంచాను. అయినా దాని పంతం నెగ్గించుకుంది. ఎగిరి బైక్ అందుకుంది. కాళ్ల వరకూ రావడంతో బైక్ వదిలేసి పారిపోయాను. సమయానికి ఊరిలో తెలిసిన వాళ్లు కనిపించారు. వాళ్లంతా కర్రలు తీసుకుని పాముని చంపే ప్రయత్నం చేశారు. కానీ వారి చేతికి చిక్కకుండా తప్పించుకు పారిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లాలో గుడ్డు పచౌరీ అనే వ్య్తక్తి మోటార్ బైక్‌పై వెళ్తూ తాచు పాము తోక మీద నుంచి వెళ్లాడు. వెంటనే గమనించుకుని వెనక్కు తిరిగి చూశాడు. అనుకున్నంతా అయింది. ఆ పాము అతడి వెనకే వస్తుంది. చచ్ఛాన్రా దేవుడా అనుకున్నాడు. దీని చేతిలో నాకు చావు ఖాయం అనుకున్నాడు. పని అయిపోయిందనుకుని బైక్‌ని వదిలేసి పరిగెట్టాడు. ఊరి వాళ్లు కాపాడినా.. అసలే పాము పగ పన్నేండేళ్లు అని ఎక్కడో విన్నాడు. అదే భయంతో క్షణం క్షణం భయపడుతూ బతుకుతున్నాడు.

Similar News