దిశా నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే నిందితులకు శిక్ష పడటంతో దిశకు న్యాయం జరిగిందంటున్నారు మహిళలు . పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పాలాభిషేకాలు చేసి సజ్జనార్‌ను కీర్తిస్తున్నారు.
సూర్యాపేటలో కాలేజీ విద్యార్థినులు సీపీ సజ్జనార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళల జోలికివస్తే కాల్చి చంపుతామనే సందేశాన్ని ఇచ్చిన పోలీసులను స్టూడెంట్స్ అభినందిస్తున్నారు. అమ్మాయిలపై దాడులు తెగపడేవారికి ఇదొక హెచ్చరిక అంటున్నారు విద్యార్థినులు. సజ్జనార్ లాంటి అధికారులే నేటి సమాజానికి కావాలని.. ఇలాంటి అధికారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని విద్యార్థులు కోరుతున్నారు.