H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చిన అమెరికా

Update: 2019-12-08 12:42 GMT

అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునే వీలు కల్పించే H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చింది ప్రభుత్వం. 2021 ఏడాదికి H1b వీసా దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. దీనిలో భాగంగా వివిధ కంపెనీలు తాము తీసుకుంటున్న ఉద్యోగుల పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ప్రతియేటా 85 వేల H1b వీసాలను లాటరీ పద్ధతిలో ఇస్తోంది. 2020- 21 సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి 1నుంచి 20వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 1నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అయితే ఎలక్ట్రానిక్ ప్రక్రియ వల్ల పేపర్ వర్క్ తగ్గుతుందని, ఐటి కంపెనీలకు, ఉద్యోగులకు సమాచారం ఇవ్వడం కూడా సులభమవుతుందని ఇమిగ్రేషన్అధికారులు తెలిపారు.

Similar News