కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీఎస్, కాంగ్రెస్‌లు చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. హోస్కెట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాగా 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అనర్హత వేటుతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.