క్యాబ్ బిల్లుపై ఈశాన్యం భగ్గుమంటోంది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి..విద్యార్థి, ప్రజా, మానవ హక్కుల సంఘాలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగాయి. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.. ఈశాన్య రాష్ట్రాల్లోపరిస్థితి రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతుండటంతో భారీగా బలగాలను మోహరించారు. పలుచోట్ల సైన్యాన్ని రంగంలోకి దించారు.
బిల్లు కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వలసలు పెరిగితే తమ సంస్కృతి సాంప్రదాయాలకు ముప్పు వాటిల్లు తుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, త్రిపురల్లో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. అసోంలో పలుచోట్లజాతీ య రహదారులను దిగ్భందించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మంగళవారం మణిపూర్ మినహా మిగతా ఈశాన్యరాష్ట్రాల్లో...బంద్ నిర్వహించారు. రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఆందోళనకారులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బిల్లుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.