సిద్ధిపేట జిల్లాలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.. ఆ ఏర్పాట్లను ఆర్థికమంత్రి హరీష్ రావు దగ్గరుండి చూస్తున్నారు. ములుగులో ఉద్యానవన విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కళాశాల, గజ్వేల్ పట్టణంలోని వేజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, తదితర భవనాలను ఈ నెల 11న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీష్ రావు సీఎం ఏర్పాట్లను పరిశీలించారు. త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోనే గజ్వేల్ అభివృద్ధి మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.