ట్రంప్ సర్కారుకు ఫెడరల్ కోర్టు షాక్!

Update: 2019-12-11 15:52 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు ఫెడరల్ కోర్టు షాకిచ్చింది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరిహద్దుగోడ నిర్మాణానికి మిలటరీ నిధులను మళ్లించడాన్ని తప్పుపట్టింది. మిలటరీ పునర్ నిర్మాణానికి వెచ్చించాల్సిన డబ్బును గోడ నిర్మాణానికి ఉపయోగించడం సరైంది కాదని టెక్సాస్ లోని యూఎస్ డిస్ట్రిక్ జడ్జి డెవిడ్ బ్రియోన్ వెల్లడించారు. అమెరికన్ కాంగ్రెస్ రక్షణ శాఖకు కెటాయించిన 3.6 బిలియన్లను గోడ నిర్మాణానికి ఉపయోగించడం చట్ట విరుద్దమని తెలిపింది. రక్షణశాఖకు చెందిన ఫండ్స్ ను మరో పనులకు ఉపయోగించడం చట్టవిరుద్దమంటూ సరిహద్దులోని మానవ హక్కుల నేతలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.

Similar News