ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరించినందుకు ముఖ్యమంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు టీడీపీ సభ్యులు. మూడు గంటలపాటు తను అనని దాన్ని అన్నట్లు చిత్రీకరించారని చంద్రబాబు ఆరోపించారు. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నోటి నుంచి ఎప్పుడూ బూతులు రావన్న చంద్రబాబు. ఏదైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానన్నారు. సీఎం దగ్గరుండి సభను పక్కదారి పట్టించినందుకు సీఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్య దుర్మార్గమని.. ఇది కచ్చితంగా ఉన్మాద చర్యేనని అన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకూడదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. మరోసారి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు.