సమతపై అత్యాచారం, హత్య కేసులో నిందితుల్ని ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇవాళ్టి నుంచి రోజువారీ విచారణ మొదలైన నేపథ్యంలో.. నిందితులపై నేరారోపణలు నిరూపించేందుకు ఇప్పటికే పక్కాగా ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు A1-షేక్‌బాబు, A2 షేక్ షాబుద్దీన్, A3-షేక్ ముగ్దుమ్‌లను ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. సాక్షుల వాంగ్మూలం, FSL నివేదిక సహా, ఇతరత్రా ఆధారాలు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో.. త్వరగా విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.