హెల్మెట్ పెట్టుకోలేదో.. జనవరి 1 నుంచి ఉందే మీకు..

Update: 2019-12-18 07:19 GMT

ఎన్ని సార్లు చెప్పినా బుద్ది రాదు.. ఎన్నని చలాన్లు రాయాలి. మీరు మారరా.. మీకోసమేగదరా నాయనా చెప్పేది.. ఛస్తార్రా బాబు అన్నా వినిపించుకోరేం.. బండి ఉంటేనే కదా రోడ్డెక్కేది.. ఆ బండే లేకుండా చేస్తే.. ఇదే చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు వచ్చే 2020 జనవరి 1నుంచి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించనున్నారు ఏపీ పోలీసులు. ప్రతి రోజు విజయవాడ నగరానికి వేలాది మంది వచ్చి పోతుంటారు. ఎవరూ హెల్మెట్ వాడుతున్నట్లు అనిపించట్లేదు పోలీసులకి. దీంతో పాటు అక్కడ జరుగుతున్న 100 ప్రమాదాల్లో 30 మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు తేలింది. దీంతో పోలీసులు జనవరి 1నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి హెల్మెట్ తప్పని సరి చేయాలని చూస్తున్నారు. ఎవరైనా హెల్మెట్ లేకుండా బండి నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్స్ నెల రోజులపాటు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లను సీరియస్‌గా తీసుకుని వాహనదారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు నగర పౌరులకు సూచిస్తున్నారు.

Similar News