టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యాడు గానీ. రాజకీయాల్లో మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఆదిలోనే అనుకోని ఎదురు దెబ్బలు తింటున్నాడు. దీంతో తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందేమో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మొదట్లోనే కరూర్ తొక్కిసలాటతో దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కున్నాడు. పైగా ఆ కేసులో ఇప్పటికీ సీబీఐ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న క్రమంలో.. పర్సనల్ లైఫ్ ఇబ్బందులు తలెత్తాయి. ఆయన భార్య సంగీత ఇప్పటికే కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ వేసింది. ఓ హీరోయిన్ తో విజయ్ కు ఇల్లీగల్ ఎఫైర్ ఉందని ఎఫ్ ఐఆర్ లో తెలిపింది విజయ్ భార్య సంగీత. రెండేళ్లుగా విడివిడిగా ఉంటుఉన్నామని.. ఆ హీరోయిన్ తో విజయ్ సంబంధాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేడని తెలిపింది విజయ్ భార్య.
ఇలా పర్సనల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాడు విజయ్. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇంకా పార్టీ ప్రజల్లోకి వెళ్లక ముందే.. విజయ్ పర్సనల్ ఇష్యూలు మొత్తం ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఒక రకంగా విజయ్ కు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే విజయ్ ఇంకా రాజకీయాల్లో కుదురుకోక ముందే అనేక ఎదురు దెబ్బలు తింటున్నాడు. పైగా భార్యకు అన్యాయం చేసిన వ్యక్తి అని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి.
ఇలా విజయ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగలడంతో.. పార్టీ ఏ మేరకు పట్టు సాధిస్తుందో అనే ప్రచారాలు మొదలయ్యాయి. తమిళ నాడు రాజకీయాల్లో ఇంకోవైపు కూటములు ఏర్పడుతున్నాయి. శశికల కొత్త పార్టీని పెడుతున్నారు. ఇంతటి పోటీలో విజయ్ ఎలా ముందుకు వెళ్తాడనేది వేచి చూడాల్సిందే.