మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన అప్లికేషన్లలో బగ్స్ (సాప్ట్‌వేర్ లోపాలు) గుర్తిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామంటోంది. గత ఏడాది, ఈ ఏడాది పలు సెక్యూరిటీ లోపాల కారణంగా లక్షల మంది వన్‌ప్లస్ కస్టమర్లకు చెందిన వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు కస్టమర్లకు మరింత సెక్యూరిటీని అందించేందుకు వన్‌ప్లస్ తాజాగా బగ్ బౌంటీ ప్రోంగ్రాంను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా వన్‌ప్లస్‌కు చెందిన సాప్ట్‌వేర్‌లో ఏవైనా బగ్స్ను గుర్తిస్తే వారికి రూ.3,55 నుంచి రూ.4,97,592 వరకు నజరానా అందిస్తారు. ఈ క్రమంలో వన్‌ప్లస్ కొత్తగా ఓ సెక్యూరిటీ రెస్పాన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. అలాగే సాప్ట్‌వేర్లలో బగ్స్ గుర్తించేందుకు గాను హ్యాకర్ వన్ అనే సెక్యూరిటీ ప్లాట్‌ఫాంతో వన్‌ప్లస్ భాగస్వామ్యం అయింది.