పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం యూపీలో అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బిజ్నూర్ లో ఇద్దరు, సంభల్, ఫిరోజాబాద్, మీరట్, కన్పూర్‌లో ఒక్కొక్క ఆందోళనకారుడు మృతిచెందినట్లు చెందారు.
ఇక, శనివారం మృతుల సంఖ్య 11 కు చేరినట్టు తెలుస్తోంది. శుక్రవారం కాల్పుల్లో తీవ్రంగా గాయపడిని మరో ఐదుగరు ఆందోళనకారులు మృతి చెందినట్టు సమాచారం. ఇదిలావుంటే, శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఆరుగురు మరణించినట్టు.. యూపీ అడిషనల్ డీజీపీ పీవీ రామశాస్త్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే, యూపీ డీజీపీ ఓ పీ సింగ్ వాదన మాత్రం మరోలా వుంది. అసలు ఆందోళనకారులపై పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా లేదని చెబుతున్నారు.