శుభవార్త.. లక్షలోపు రైతులకు రుణమాఫీ

Update: 2019-12-22 06:20 GMT

మహారాష్ట్రలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి ప్రభ్వుతం మరో హామీని నెరవేర్చింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు లక్షలోపు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక ప్రకటన చేశారు. 2019 సెప్టెంబరు 30 నాటికి రుణాలు పొందిన రైతులకు 2 లక్షల వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి మహాత్మా జ్యోతిరావు ఫూలే రుణాల రద్దు పథకం అని పేరు పెట్టినట్లు తెలిపారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినవారి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. పంటల రుణాల రద్దుకు షరతులేవీ లేవని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు.

ఐతే.. ప్రభుత్వం తన హామీని సంపూర్ణంగా నెరవేర్చడం లేదని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Similar News