ఊరిస్తున్న జార్ఖండ్ ఫలితాలు

Update: 2019-12-23 09:01 GMT

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ రౌండ్ రౌండ్‌కు లీడ్‌లు మారుతున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నప్పటికీ.. అధికార పీఠానికి దూరంలో నిలిచిపోయే అవకాశాలున్నాయి. JMM-కాంగ్రెస్‌ కూటమి మేజిక్ ఫిగర్‌కు చేరువలో దూసుకుపోతోంది.

JMM-కాంగ్రెస్‌ కూటమి మేజిక్ నంబర్‌ 42 స్థానాల్లో లీడ్‌లో ఉంది. అటు అధికార బీజేపీ 27 చోట్ల లీడ్‌లో ఉంది. AJSU నాలుగు చోట్ల, ఇతరులు 8 చోట్ల దూసుకుపోతున్నారు. జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి ఆశించినంత అనుకూలంగా లేవు. వరుసగా రెండోసారి అధికారం చేపడదామనుకున్న బీజేపీ ఆశలకు గండిపడేలా ఉంది. ఫలితాలు ఆశించినస్థాయిలో లేనప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎం రఘువర్ దాస్‌ ధీమాగా ఉన్నారు. ప్రధాన పార్టీల మధ్య మార్జిన్‌ తక్కువగా ఉందన్నారు. జార్ఖండ్‌ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. ఈ క్రమంలో చిన్న పార్టీలైన AJSM, JVM, ఇతరులు కీలకంగా మారారు. కొనసాగుతున్న ఫలితాల ట్రెండ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్న మహారాష్ట్ర, నేడు జార్ఖండ్‌, రేపు ఢిల్లీ అని చెప్పారు.

మేజిక్ ఫిగర్‌ను సమీపిస్తుండటంతో JMM- కాంగ్రెస్‌ కూటమి సంబరాలు మిన్నంటుతున్నాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చుతున్నారు. ఫలితాల్లో.. తమ కూటమి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని.. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి RPN సింగ్‌ తెలిపారు. హేమంత్ సోరెన్‌ సీఎంగా బాధ్యతలు చేపడతారన్నారు.

Similar News