పని వాయిదా వేస్తే సమయంతో పాటు పైసలూ నష్టపోతారు. ఈ ఏడాదికి సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేయడం వాయిదా వేశారనుకోండి అనవసరంగా రూ. 10వేలు కట్టాల్సి వస్తుంది. 2019-20 అసైన్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్ (ఐటీఆర్) దాఖలుకు 2019 ఆగస్ట్ 31తో గడువు పూర్తయ్యింది. అప్పటికి దాఖలు చేయని వారికి రూ.5వేలు జరిమానా చెల్లిస్తూ డిసెంబర్ 31 లోపు కట్టమన్నారు. అప్పటికీ రిటర్న్స్ సమర్పించలేదనుకోండి 2020 మార్చి 31 లోపు చెల్లించేందుకు గడువు వున్నా అనవసరంగా రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ట్యాక్సబుల్ ఇన్‌కమ్ ఉన్న వారు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం ఐటీఆర్ దాఖలు చేయాలి.