ప్రాణాపాయం నుంచి బయటపడిన ఇజ్రాయెల్ ప్రధాని

Update: 2019-12-26 14:18 GMT

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. క్షిపణి దాడి నుంచి నెతన్యాహూ తప్పించుకున్నారు. భద్రతా విభాగం అప్రమత్తంగా ఉండడంతో నెతన్యాహూకు ప్రమాదం తప్పింది. మిసైల్ అటాక్‌ను పసిగట్టిన సెక్యూరిటీ సిబ్బంది, వెంటనే నెతన్యాహూ, ఆయన భార్య సారాను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

నెతన్యాహూ అష్కెలాన్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా సెక్యూరిటీ అలారమ్ మోగింది. ఆ సైరన్, మిసైల్ ప్రయోగానికి సంబంధించినది. అలారమ్ సౌండ్ రావడంతోనే ఇజ్రాయెల్ సైన్యం అలర్టైపోయింది. వెంటనే ఐరన్ డోమ్ సెక్యూరిటీ సిస్టమ్ సాయంతో, ఆ రాకెట్‌ను కూల్చేసింది. అనంతరం నెతన్యాహు, ఆయన భార్య సారాను సురక్షిత ప్రాంతానికి తీసు కెళ్లారు. నెతన్యాహూపై క్షిపణి దాడి ప్రయత్నాలు జరగడం ఇది రెండోసారి.

Similar News