మిగ్‌ 27 యుద్ధ విమానానికి వీడ్కోలు

Update: 2019-12-27 14:08 GMT

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఏస్‌ ఎటాకర్‌గా పేరుగాంచిన మిగ్‌-27 యుద్ధ విమానానికి వీడ్కోలు పలుకుతున్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాక్‌పై ప్రతాపాన్ని చూపించింది మిగ్‌-27. సుమారు మూడు దశాబ్దాలపాటు మిగ్‌-రకం యుద్ధ విమానాలు అసామాన్యమైన సేవలు అందించాయి. జోధ్‌పూర్‌లోని ఎయిర్‌ బేస్‌ స్టేషన్‌లో మిగ్‌-27కు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. యుద్ధ రంగంలో ఆర్మీకి మిగ్‌-27 విమానాలు వెన్నుదన్నుగా నిలిచి విశేష సేవలందించాయి మిగ్ విమానాలు.

2006లో అప్‌గ్రేడ్‌ అయినప్పటి నుంచి మిగ్ 27 రకం ఫైటర్‌ సేవలు అందించింది. మిగ్‌-23 BN, మిగ్‌-23 MF విమానాలకు చాలా ఏళ్ల కిందటే ఎయిర్‌ఫోర్స్‌ నుంచి రిటైర్మెంట్ ఇచ్చారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో.. శత్రువుల స్థావరాలపై గురితప్పకుండా రాకెట్లు, బాంబులు విసిరిన ఘనత మిగ్‌ -27 సొంతం. ఆపరేషన్ పరాక్రమ్‌లోనూ మిగ్ విమానాలు అద్భుత ప్రదర్శన ఇచ్చాయి. ప్రస్తుతం.. 29 స్క్వాడ్రన్‌ ఒక్కటే.. మిగ్‌-27 విమానాలను ఆపరేట్‌ చేస్తోంది. అప్‌గ్రేడ్ అయిన.. మిగ్‌-27 విమానాలు అనేక దేశీయ, విదేశీ మిలిటరీ ఎక్సర్‌సైజుల్లో పాల్గొన్నాయి.

ఆర్మీ గ్రౌండ్ ఎటాక్ కేపబిలిటీని పెంచే లక్ష్యంతో.. మిగ్ విమానాలను 1985లో ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చారు. అప్పటి నుంచి అనేక ఆపరేషన్లు, కార్గిల్‌ యుద్ధంలో మిగ్‌ విమానాలు విశేష సేవలందించాయి. మిగ్‌ ఫేర్‌వెల్ సందర్భంగా... జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

 

Similar News