పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలిపారు అమెరికాలోని ప్రవాస భారతీయులు. భారత్ కు రక్షణ కవచంగా ఉన్న ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా సీఏఏ కు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి, స్వీట్లు పంచుకున్నారు. విదేశాల నుంచివచ్చే మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడాన్ని వారు గట్టిగా సమర్ధించారు. ఓహియో, ఆస్టిన్ ప్రాంతాల్లో వందలాదిమంది ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.