పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకోలేదా? అయితే వెంటనే చేసుకోవాలి.. లేదంటే..

Update: 2019-12-28 03:53 GMT

పాన్‌ కార్డుతో మీ ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకోలేదా? అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలుంది. పాన్‌తో ఆధార్‌ లింక్‌కు ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం... డిసెంబర్‌ 31 తరువాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేని పక్షంలో పాన్‌ కార్డు పని చేయదని వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను చట్టంలో ఈ మేరకు సవరణను ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఆదాయ పన్ను వెబ్‌సైట్‌లో ఆధార్‌, పాన్‌ అనుసంధానం లింక్‌పై క్లిక్‌ చేసి.. ఆ రెండింటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోపు రెండింటినీ జతచేయడంలో విఫలమైతే.. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏఏ ప్రకారం పాన్‌ కార్డును రద్దు చేస్తారు. ఒకవేళ తుది గడువు ముగిసిన తర్వాత అనుసంధానిస్తే పాన్‌ మళ్లీ పనిచేస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. తుది గడువు దాటిపోతే పాన్‌ కార్డు ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Similar News