రాబోయే రోజుల్లో బంగారం..

Update: 2019-12-30 09:44 GMT

మగువలు అమితంగా ఇష్టపడే బంగారం ముందు ముందు మరింత ప్రియం కానుంది. బంగారాన్ని ఇన్‌వెస్ట్‌మెంట్ కోసం కూడా కొనుగోలు చేస్తుంటారు. ఈ ధోరణి మధ్యతరగతి వర్గాలలో కూడా ఎక్కువైంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఔన్సు (31.10 గ్రాములు)1513 డాలర్లుగా ఉన్న బంగారం ధర, 2030 నాటికి 2400 డాలర్లకు చేరుకుంటుందని, అది 3,000 డాలర్లకు కూడా పెరిగే అవకాశం ఉందని ఏఎన్‌జడ్ అంచనా. దేశీయంగాను రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. 2010లో అయితే ఔన్సు బంగారం ధర 1000 డాలర్ల లోపే ఉండేది. ఇక వజ్రాల విషయానికి వస్తే నాణ్యతను బట్టి రేటు ఉంటుంది.

ప్రస్తుతం క్యారెట్ నాణ్యతను బట్టి రూ.3 నుంచి 10 లక్షలు ఉంటోంది.

Similar News