Container : ఆభరణాలతో ఉన్న కంటైనర్ బోల్తా

Update: 2024-05-08 07:20 GMT

వందలకోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలను తరలిస్తున్న కంటైనర్ బోల్తాపడిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడు లోని ఈరోడ్ సమీపంలో దిబోలో 810

కిలోల పసిడితో వెళుతున్న ఒక్క ప్రైవేటు కంటెయినర్ సోమవారం రాత్రి బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు.

అందులో ఉన్న బంగారు ఆభరణాల విలువ రూ.665 కోట్లు ఉంటుందని అంచనావేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ప్రైవేటు లాజిస్టిక్స్ సంస్థకు చెందిన కంటెయినర్ బంగారు అభరణాలను లోడ్ చేసుకుని కోయంబత్తూరు నుంచి సేలంకు బయలు దేరింది. సమతుపపురం సమీపంలోకి రాగానే వైదర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది.

డ్రైవర్ శశికుమార్తో పాటు సెక్యూరిటీ గార్డు బాలారాజ్ కిందపడిపోవడంతో గాయపడ్డారు. అయితే కంటెయిర్ లోపల ఉన్న ఆభరణాలు సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చిటోడే పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News