సీఎఎ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో డీఎంకే నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఇళ్ల ముందు NO CAA, NO NRC నినాదంతో రంగోలిలు వేశారు. డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కార్యకర్తలు ముగ్గులు నిరసన వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే పిలుపు మేరకు కార్యకర్తలు పలు చోట్ల ముగ్గులు వేసి నిరసన తెలిపారు.
మరో వైపు బెసెంట్ నగర్ ప్రాంతంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి నిరసన తెలుపుతున్న ఏడుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులను నిర్బంధించడాన్ని స్టాలిన్ ఖండించారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులు కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.