తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్

Update: 2020-01-01 07:24 GMT

భారత తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ పగ్గాలు చేపట్టారు. వార్ మెమోరియల్ ను సందర్శించి.. సైనిక వందనం స్వీకరించిన రావత్.. ఆ తర్వాత సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీడీఎస్ హోదాలో.. బుధవారం నుంచి ఆయన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ లకు దిశానిర్దేశం చేస్తారు. అంతేకాదు, రక్షణ శాఖకు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో త్రిదళాలకు ఆదేశాలు జారీ చేస్తారు.

తొలి సీడీఎస్ గా టీమ్ వర్క్ తో పనిచేస్తానని రావత్ తెలిపారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల సమన్వయంతో పనిచేస్తానని అన్నారు. సీడీఎస్ హోదా తనకు దక్కిన గౌరవమని బిపిన్ రావత్ తెలిపారు.

Similar News