ఏసీబీ పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం

Update: 2020-01-02 09:26 GMT

ఏసీబీ పని తీరుపై సీఎం జగన్‌ రివ్యూ చేశారు. అధికారులు ఆశించిన రీతిలో పని చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలన్న సీఎం..... ఏసీబీ సిబ్బందికి అలసత్వం ఉండకూడదన్నారు. 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని, ఈ కాల్‌ సెంటర్‌తో మంచి ఫలితాలు కనిపించాలన్నారు. ప్రజలెవ్వరూ కూడా అవినీతిబారిన పడకూడదని ఆదేశాలు జారీ చేశారు. లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని, అధికారులు లంచాలు తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి రావాలన్నారు. సెలవులు లేకుండా పనిచేయాలని, మూడు నెలల్లో మార్పు కనిపించాలని ఆదేశించారు సీఎం జగన్‌. ఇందుకోసం కావాల్సినంత సిబ్బందిని తీసుకోవాలని... ఎలాంటి సదుపాయాలు కావాలన్న ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు సీఎంజగన్‌. మరో నెలరోజుల్లోనే తిరిగి రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం జగన్‌.

Similar News