రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఎన్ఆర్ఐల డిమాండ్

Update: 2020-01-06 07:16 GMT

రాజధానిగా అమరావతే ఉండాలని NRIలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో ప్రవాసాంధ్రులంతా సేవ్ అమరావతి నినాదంతో నిరసన తెలిపారు. తామంతా కూడా రైతు కుటుంబాల నుంచే వచ్చామని, రైతు కష్టాన్ని తక్కువగా చేసి పెయిడ్ ఆర్టిస్టులంటూ విమర్శించవద్దని కోరుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము స్వాగతిస్తామని.. కానీ పాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతిని నాశనం చెయ్యొద్దని అంటున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశానికి హాజరైన వారంతా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అమరావతి ముమ్మాటికీ ప్రజారాజధానే అని అంటున్నారు NRIలు. USAలో ఉన్న ప్రవాసాంధ్రులంతా అమరావతి కోసం గళమెత్తారు. 3 రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా తాము ఉత్సాహంగా ఉన్నామని.. భవిష్యత్‌లో మహా నగరంగా అమరావతి నిలుస్తుందని అనుకున్నామని.. కానీ జగన్ సర్కారు తీరుతో AP బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'NRI రైతు బిడ్డలం' అంటూ వారంతా అమరావతి కోసం నినదించారు.

Similar News