సంక్రాంతి సెలవులు వచ్చేసాయోచ్..

Update: 2020-01-07 05:34 GMT

సంక్రాంతి సంబరాలు అంతటా జరుపుకున్నా ఏపీలో సంక్రాంతి ఎంతో స్పెషల్. కోడిపందాలు, గంగిరెద్దులు, డూడూ బసవన్నల కోలాహలం.. సెలవుల్లో పిల్లల సంతోషం పతంగుల రెపరెపల్లో కనిపిస్తుంది. అందుకే ఏపీ గవర్నమెంట్ స్కూల్స్‌కు 10 రోజులు సెలవులు ఇచ్చి పండగ చేసుకోమంది. జనవరి 10 నుంచి మొదలు జనవరి 20 వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. జనవరి 21న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాలేజీ విద్యార్థులకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే మాత్రం ఊరుకోబోమంటోంది విద్యాశాఖ. అలాంటిదేమైనా అధికారుల దృష్టికి వచ్చిందో ఆయా పాఠశాలలు, కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News