భారత సైన్యంపై ఉగ్రవాదులు కుట్ర.. కొత్త రూట్ ఎంచుకున్నటెర్రరిస్టులు

Update: 2020-01-07 13:59 GMT

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే భారత సైన్యంపై ఉగ్రవాదులు మరో కుట్ర పన్నారు. జవాన్లను హతమార్చడానికి టెర్రరిస్టులు ఈసారి కొత్త రూట్ ఎంచుకున్నారు. సైనికులు తీసుకునే ఆహారం, నీటిలో విషయం కలపాలని తీవ్రవాదులు ప్లాన్ చేశారు. ఈ కుట్రను నిఘా బృందాలు పసికట్టాయి. వెంటనే ఆర్మీకి సమాచారం అందించాయి. ఉగ్రవాదుల కుట్ర వివరాలను సైన్యానికి అందించిన నిఘా వర్గాలు ఆహారం, నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ అప్రమత్తమైంది. కశ్మీర్‌లో పని చేస్తున్న జవాన్లు తీసుకునే ఆహారం, నీళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే, కశ్మీర్‌లోకి చొరబడడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం అడ్డుకుంది. సరిహద్దుల్లో ఫుల్ అలర్ట్‌గా ఉంటున్న భద్రతా బలగాలు, ముష్కరమూకల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని అంతమొందిస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను అరికట్టడంలో భారత సైన్యం విజయవంతమైందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే పేర్కొన్నారు.

Similar News