10వ తరగతి అర్హతతో 'బెల్‌'లో ఉద్యోగాలు..

Update: 2020-01-13 05:28 GMT

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 550 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు.. ఫిట్టర్: 140, వెల్డర్: 45, టర్నర్: 35, మెషినిస్ట్ కంపోజిట్: 57, ఎలక్ట్రీషియన్: 140, డ్రాప్ట్స్ మెన్ (మెకానిక్): 10, ఎలక్ట్రానిక్స్: 06, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA,PASA): 70, కార్పెంటర్: 08, ప్లంబర్: 10, మెకానిక్ మోటారు వాహనం: 06, మెషినిస్ట్ (గ్రైండర్): 10, మషన్ (MES): 08, పెయింటర్ (జనరల్): 05.

అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిపికెట్ కలిగి ఉండాలి. ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వయస్సు: అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి. ముఖ్య తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 6, 2020. దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2020.

Similar News