పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుంది. అలాగే ఉంది డెలివరీ బాయ్ చేసిన పని కూడా. ఇప్పుడు సీసీటీవీల హవా నడుస్తోంది. కాలు కదిపినా రికార్డైపోతుంది. లిప్ట్‌లోనే కదా ఎవరూ చూడట్లేదనుకున్నాడు.. టర్కీకి చెందిన ఓ డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన పిజ్జాను తీసుకువెళ్లాడు. లిప్ట్‌లో పార్శిల్ ఓపెన్ చేసి అందులో ఉమ్మి వేశాడు. మళ్లీ ప్యాక్ చేసి తీసుకెళ్లి కస్టమర్‌కి ఇచ్చాడు. విషయం తెలియక అతడు దాన్ని తినేశాడు.
సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్న అపార్ట్మెంట్ వాసులకు డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం తెలిసింది. వెంటనే సదరు సంస్థకు పిర్యాదు చేశాడు పిజ్జా ఆర్డర్ చేసిన కస్టమర్. దాంతో సంస్థ యజమానులు ఆరోజు డెలివరీ చేసిన బాయ్‌ని పట్టుకున్నారు. అతని పేరు బురకగా గుర్తించారు. కస్టమర్ డెలివరీ బాయ్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కేసు టర్కీ కోర్టులో విచారణకు వచ్చింది. బురక్ చేసిన నీచమైన పనికి అతడికి రూ.48వేల జరిమానా.. 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.