రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత్ వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెస్సియాస్ బొల్సొనారోకు.. రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోదీ.. బొల్సొనారోకు స్వాగతం పలికారు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు సైనిక దళాల గౌరవ వందనాన్ని.. స్వీకరించారు.
బొల్సొనారో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్, ఇండియా మధ్య పలు రంగాల్లో మొత్తం 15 ఒప్పందాలు జరగనున్నాయి. సామాజిక భద్రత, బయో ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, వైద్య రంగాల్లో రెండు దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి.