వ్యక్తిగత కక్షతో వ్యవస్థలను రద్దు చేయడం మంచి పద్దతి కాదు: రెడ్డి సుబ్రమణ్యం

Update: 2020-01-24 20:20 GMT

వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం అంటే బిల్లును ఆమోదించినట్లు కాదని, అలాగని తిరస్కరించినట్లు కాదన్నారు మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం. ప్రజల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్లడంపై ఇంత రాద్దాంతం అనవసరమన్నారాయన. తండ్రి ఆశయాలతో ముందుకెళ్లే సీఎం జగన్‌.. తండ్రి ఏర్పాటు చేసిన మండలిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షతో వ్యవస్థలను రద్దు చేయాలనుకోవడం మంచిపద్దతి కాదన్నారు. ఒకవేళ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం చేసినా.. వెంటనే మండలి రద్దు కాదన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపినా.. అక్కడ రద్దు చేయాలనే రూల్‌ లేదన్నారు.

Similar News