రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రముఖుల నివాళి

Update: 2020-01-30 14:07 GMT

మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు ఉదయం నుంచి చేరుకున్న ప్రముఖులు కాసేపు అక్కడ కూర్చొని.. గాంధీజీ సమాధి దగ్గర నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గాంధీకి అంజలి ఘటించారు. ఉపరాష్ట్రపతి వెంకయన్నాయుడు గాంధీకి నివాళులర్పించి ఆయన స్మృతులు నెమరవేసుకున్నారు. తరువాత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇతర కేంత్రమంత్రులు కాసేపు రాజ్‌ఘాట్‌ దగ్గర కూర్చొని గాంధీజీ స్మృతులను నెమరవేసుకుని.. నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇతర కాంగ్రెస్‌ నేతుల ఉదయాన్ని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడే కాసేపు ఉండి గాంధీ సమాధికి నివాళులర్పించారు.

Similar News