కరోనా ఆసుపత్రి.. 48 గంటల్లో వెయ్యిపడకలతో భవన నిర్మాణం..

Update: 2020-01-31 16:35 GMT

వ్యాధి వచ్చింది.. దాన్ని తగ్గించడం. మరి కొంత మంది వ్యాపించకుండా చూడడం.. ఇలాంటి బాధ్యతలన్నీ అత్యంత వేగవంతంగా పూర్తి చేయడానికి చైనా ఏకంగా ఒక భవనాన్నే నిర్మిస్తోంది. కరోనా వైరస్ వచ్చిన రోగులందరికీ చికిత్స అందించే నిమిత్తం వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. వ్యాధి సోకిన దాదాపు ఆరువేల మంది రోగుల కోసం ఖాళీగా ఉన్న ఓ భవనాన్ని అత్యవసర ఆసుపత్రిగా తీర్చిదిద్దింది. మొట్టమొదట కరోనా రోగిని గుర్తించిన 'ఊహన్' పట్టణానికి సమీపంలో ఉన్న హాంగ్‌కాంగ్ నగరంలనే ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.

భవన నిర్మాణ కార్మికులు ఓ పక్క తమ పని తాము చేస్తున్నా మరో పక్క ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అధికారులు రోగులకు కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి డెబ్బీ మౌంటేన్ రీజనల్ మెడికల్ సెంటర్‌గా దీనికి నామకరణం చేసి కరోనా వైరస్ హాస్పిటల్‌కు అంకితం ఇచ్చారు. ఇందులోకి మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు మొదటి బ్యాచ్ కరోనా వైరస్ రోగులను తరలించారు. ఇతర కరోనా వైరస్ రోగుల కోసం ఊహాన్‌కు 75 కిలోమీటరల్ దూరంలో మరో భారీ ఆసుపత్రి భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పది రోజుల్లో ఆసుపత్రి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Similar News