టెక్‌ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..!

Update: 2020-01-31 14:18 GMT

టెనాలజీ దిగ్గజం ఐబీఎం నూతన సీఈఓగా భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ (57) ఎన్నికయ్యారు. ఐబీఎం బోర్డు అఫ్ డైరెక్టర్లు ఆయనను తదుపరి సీఈఓగా ఎన్నుకున్నట్టు ఐబీఎం ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి నూతన సీఈఓగా అరవింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారని పేర్కొంది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న గిన్నీ రోమెట్టీ ఏ ఏడాది రిటైర్ కానున్నారు, ప్రస్తుతం ఆమె ఐబీఎం చైర్మన్ గా కొనసాగుతున్నారు. కృష్ణ 1990 లో ఐబీఎంలో చేరారు.

కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేశారు. ఐబీఎం సీఈఓ గా ఎన్నిక కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు కృష్ణ. 'ఐబిఎమ్ యొక్క తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎన్నుకోబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది, గిన్ని మరియు బోర్డు నాలో ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తాను' అని కృష్ణ ఐబిఎం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

Similar News