నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు: రాహుల్ గాంధీ

Update: 2020-02-01 18:11 GMT

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం మాటలకు పరిమితమైన బడ్జెట్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన మండిపడ్డారు. దేశాన్ని పట్టిపీడీస్తున్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. నిరుద్యోగం సమస్యపై బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఉద్యోగ కల్పనకు తీసుకోవాల్సిన చర్యల్ని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అన్నారు.

అటు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా బడ్జెట్ పై తీవ్రంగా స్పందించారు. మధ్య తరగతి ప్రజలకు కాస్త టాక్స్ బెనిఫిట్ తప్ప.. ఈ బడ్జెట్ తో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. ఈ బడ్జెట్ తో దేశం స్టాండింగ్ ఇండియా నుంచి సిట్ డౌన్ ఇండియా వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు.

Similar News