వినూత్న రీతిలో రైతుల నిరసనలు.. అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Update: 2020-02-05 13:12 GMT

అమరావతి రైతుల ఆందోళనలు 50వ రోజు ఉధృతంగా సాగుతున్నాయి. కాసేపట్లో రాజధాని గ్రామాల్లో మరోసారి చంద్రబాబు పర్యటించనున్నారు. నేటికి నిరసనలు చేపట్టి 50 రోజులు కావడంతో రైతులను కలిసి చంద్రబాబు పరామర్శించనున్నారు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ సెంటర్లలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి.. వారిని పరామర్శించనున్నారు.

ఇటు రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు కుల ప్రదర్శనలు చేశారు. కొందరు డప్పులు వాయిస్తూ నిరసన తెలిపితే.. మరికొందరు బట్టలు ఉతికి, ఐరెన్‌ చేసి, చెప్పులు కుట్టి ఇలా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.

మందడం, పెదపరిమి, వెలగపూడి, ఇతర గ్రామాల్లోనూ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఓ వైపు రిలే దీక్షలు కొనసాగిస్తూనే.. కుల వృత్తుల ప్రదర్శన చేస్తున్నారు.. దాదాపు అన్ని గ్రామాల్లో మహిళలు, పురుషులు అని తేడా లేకుండా బట్టలు ఉతుకుతూ తమ నిరసనలు తెలియజేశారు.

Similar News