ఒక్క ప్రాంతంలోనే లక్ష కోట్లు కుమ్మరించే ఆర్థిక సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు లేదు: సీఎం జగన్

Update: 2020-02-05 16:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్ ఎడ్యుకేషన్‌ కార్యక్రమం జరిగింది. ఆ ప్రోగ్రామ్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని వివాదంపై ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంతా ఒక్క చోటే కేంద్రీకృతం కాకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఒక్క ప్రాంతంలోనే లక్ష కోట్లు కుమ్మరించే ఆర్థిక సామర్థ్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు లేదన్నారు.

విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా చేయడాన్ని సీఎం జగన్ సమర్దించుకున్నారు. పదేళ్లలోనే విశాఖ టాప్ సిటీగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. చాలా వేగంగా డెవలప్ అయ్యే కెపాసిటీ వైజాగ్‌కు ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని సీఎం జగన్ గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వా ల్సిన అవసరముందన్నారు. గోదావరి కృష్ణా అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేస్తే కరవు నుంచి బయటపడే అవకాశముంటుందన్నారు.

Similar News