'సిఎఎ' కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ కేబినెట్ తీర్మానం

Update: 2020-02-05 19:56 GMT

కొత్త పౌరసత్వ చట్టం 'సిఎఎ' కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేసింది. 'సిఎఎ' రాజ్యాంగంలోని నీతిని ఉల్లంఘిస్తోందని దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించింది, అంతేకాకుండా 'సిఎఎ' ను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈ చట్టం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. మతపరమైన ప్రాతిపదికన అక్రమ వలసదారుల మధ్య తేడాను చూపుతుందని.. ఇటువంటి నిబంధనలు చట్టంలో ఎందుకు చేర్చబడ్డాయో అర్థం కావడంలేదని.. దీనివలన ప్రజలు నష్టపోతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది. కాగా ఇదివరకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందు.. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాయి. త్వరలో ఛత్తీస్ఘడ్ కూడా దీనిపై తీర్మానం చేసే అవకాశం ఉంది.

Similar News