ప్రజలే కేంద్రంగా పురపాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: కేటీఆర్

Update: 2020-02-06 19:45 GMT

పురపాలక శాఖాధికారులు ప్రజలతో మమేకం కావాలన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రజలే కేంద్రంగా పురపాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, పౌరసేవలు పారదర్శకంగా, అవినీతి రహితంగా, వేగంగా అందించాలన్నారు. కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్‌.. పురపాలన పట్ల ప్రభుత్వ విధానాలను స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో విధులే జాబ్‌ చార్ట్‌గా భావించాలని. ప్రజలతో మమేకమయ్యేందుకు సోషల్‌మీడియాను విరివిగా ఉపయోగించాలన్నారు.

Similar News