ఏపీలో సినిమాలు ఆడనివ్వం: అమరావతి విద్యార్థి జేఏసీ

Update: 2020-02-08 15:20 GMT

రాజధానిగా అమరావతి కోసం జేఏసీ ఉద్యమం ఉధృతమైంది. రైతుల ఉద్యమానికి సినీపరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు అమరావతి విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన తలపెట్టింది. 53 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా సినీ ఇండస్ట్రీ ఏ మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలిపాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

సినీ పరిశ్రమ అంతా రాజధాని ఉద్యమానికి తరలిరావాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వకపోతే ఏపీలో సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. తాము సినిమాలు చూడటం వలే మీరు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని అమరావతి విద్యార్థి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో జేఏసీ నేతలు సమావేశమైయ్యారు. రాజధానిగా అమరావతి ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని వినతి పత్రం ఇచ్చారు. టాలీవుడ్ హీరోలు అమరావతికి మద్దతు ఇవ్వాలని కోరారు. వారిని వినతి పై సానుకూలంగా స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు అమరావతి రైతుల త్యాగం మరవలేనిదని పేర్కొన్నారు.

Similar News